ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీ ఏజెంట్ల వృత్తి పన్ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-01-25T03:52:17+05:30

ఎల్‌ఐసీ ఏజెంట్ల వృత్తి పన్ను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు అన్నారు.

మాట్లాడుతున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 24: ఎల్‌ఐసీ ఏజెంట్ల వృత్తి పన్ను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు అన్నారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ వృత్తిపన్నును ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎల్‌ఐసీ కార్యాలయం ద్వారానే రికవరీ చేసుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా రికవరీ చేయమని సీటీవో ఆదేశాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ చర్యను ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గురునాఽథం, మధుసూదన్‌రావు, వెంకటేశ్వర్లు, మణి, బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


============================================

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు

గూడూరు, జనవరి 24:  రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానిక తిలక్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ విందూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని వెళుతుండగా, విందూరు కార్యదర్శి సుధాకర్‌ ఆయన మోటార్‌సైకిల్‌పై ఎక్కాడు. మధురెడ్డి కాలనీ సమీపంలో ఎదురుగా వచ్చిన ఓ బైక్‌ వీరిని ఢీకొనడంతో   లక్ష్మీనారాయణతోపాటు, ప్రమాదానికి కారణమైన బైక్‌పై ప్రయాణిస్తున్న శ్రీను, మరో యువకుడికి గాయాలయ్యాయి.  వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం లక్ష్మీనారాయణను నెల్లూరుకు తరలించారు.

Updated Date - 2022-01-25T03:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising