పంటకాలువ ఆక్రమణల పరిశీలన
ABN, First Publish Date - 2022-03-06T04:58:53+05:30
నాయుడుపేట మండలం పుదూరు పంట కాలువ ఆక్రమణలను లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గంగరాజు పరిశీలించారు.
పుదూరు పంట కాలువ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
నాయుడుపేట, మార్చి 5 : నాయుడుపేట మండలం పుదూరు పంట కాలువ ఆక్రమణలను లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గంగరాజు పరిశీలించారు. పుదూరు పంటకాలువ ఆక్రమణలపై తీగ భాస్కర్ లోకాయుక్తను ఆశ్రయించారు. తహసీల్దారు శ్రీనివాసులు, ఇరిగేషన్ డీఈ కోటేశ్వరరావు, సర్వేయర్ శ్రీరాములు పెళ్లకూరు మండలం పెన్నేపల్లి నుంచి నాయుడుపేట మండలం పుదూరు వరకు ఉన్న పుదూరు పంటకాలువ ఆక్రమణలను పరిశీలించారు. చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-03-06T04:58:53+05:30 IST