ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమర్శలకు తావిస్తున్న రోడ్డు విస్తరణ సర్వే

ABN, First Publish Date - 2022-10-08T04:42:57+05:30

బుచ్చిరెడ్డిపాళెంలోని చెన్నూరురోడ్డులో రోడ్డు విస్తరణకు చేపడుతున్న సర్వే విమర్శలకు తావిస్తోంది.

బుచ్చిరెడ్డిపాళెం చెన్నూరురోడ్డులో రోడ్డు విస్తరణకు సర్వే చేపడుతున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ సర్వేకు స్వస్తి ఫ ప్రైవేటు సర్వేతో కుస్తీ

బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు7: బుచ్చిరెడ్డిపాళెంలోని చెన్నూరురోడ్డులో రోడ్డు విస్తరణకు చేపడుతున్న సర్వే విమర్శలకు తావిస్తోంది. జిల్లా సర్వేయర్‌ ఆఽధ్వర్యంలో మండల సర్వేయర్‌ సచివాలయాల సర్వేయర్లతో సర్వే చేపట్టాలి. అందుకు స్వస్తి పలికి ప్రైవేటు సర్వేయరుతో కుస్తీ పట్టడంపై స్థానిక ప్రజల్లో చర్చనీయాంశమైంది. రికార్డులు లేకుండా ప్రైవేటు సర్వేయర్లు సర్వే చేసి ఏమి ప్రయోజనమనే విమర్శలు వినవస్తున్నాయి. బస్టాండ్‌ సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహం నుంచి మలిదేవి కాలువ వరకు సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్డుకిరువైపులా డ్రైన్ల ఏర్పాటుకు చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ సర్వే సిఫార్సులకు సలాం చేస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. చెన్నూరురోడ్డులో  ప్రభుత్వ స్థలం ఎంత ఉందనే తరహాలో సర్వే చేసి ఆమేరకు విస్తరణ చేయాలి. ఆ తరువాత రోడ్డుకు ఎక్కడెక్కడ ఎంత స్థలం అవసరమో  స్థలాల యజమానులతో చర్చించాలి. ఆ మేరకు వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలం కొనుగోలు చేయాలి. ఆ తరువాతే రోడ్డుకిరుపైపులా డ్రైన్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వాటిన్నంటినీ తోసి ఇలా వ్యాపారులు చెప్పిన  చోటకో లేక నేతలు సిఫార్సులకో సలాం చేస్తే రోడ్డు విస్తరణ  ఎలా జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెన్నూరు రోడ్డు ప్రారంభమయ్యే బస్టాండ్‌ నుంచి 62 అడుగుల వెడల్పుతో ప్రారంభమై మలిదేవి ప్రాంతానికెళ్లేసరికి 62 అడుగులే ఉంటుందని స్థానిక పెద్దలు చెబుతున్నారు. మధ్యలో ఒక్కో ప్రాంతంలో 55 అడుగులు, 54, 50, 44, 35, కొత్త బస్టాండ్‌ సెంటర్‌లోకి వచ్చే సరికి 112, ఆ తరువాత 62 అడుగల వెడల్పు ఉన్నట్టు కొందరు స్థానికులు చెబుతున్నారు.  అయితే ఈ మేరకు వ్యాపారులు దుకాణాల ముందు ఆక్రమణలు, రేకుల షెల్టర్లను స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు.  వారం రోజులుగా చేపడుతున్న రోడ్డు సర్వేతో ఆక్రమణలు కూడా నేడో రేపో తొలగించనున్నట్టు సమాచారం. ఈవిషయమై నగర పంచాయతీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. 

Updated Date - 2022-10-08T04:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising