ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN, First Publish Date - 2022-07-07T03:57:46+05:30

మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నారని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

రూరల్‌ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలు పరిష్కరించాలని రూరల్‌ ఎమ్మెల్యేకు వినతి

నెల్లూరు (వైద్యం), జూలై 6 : మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నారని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నేతలు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. బుధవారం మున్సిపల్‌ కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పెంచలనర్సయ్య, గౌరవాధ్యక్షుడు కుమార్‌లతో కలసి రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయానికి సీపీఎం నేతలు, కార్మికులు ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మూడేళ్లగా పోరాడుతున్నా ఫలితం లేదన్నారు. సమానపనికి సమాన వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ నేటికీ నెరవేరలేదన్నారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు 5 నెలలుగా ఇవ్వటం లేదని, జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదని, 60ఏళ్లు దాటిన వారికి ఎలాంటి బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తున్నారని, వారి స్థానంలో పనిలోకి తీసుకున్న వారసులకు 11 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెకు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బత్తల క్రిష్ణయ్య, కొండా ప్రసాద్‌, సుజాత, వజ్రమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-07T03:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising