ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగ్‌బాస్‌ రియాలిటీ షోను నిషేధించాలి

ABN, First Publish Date - 2022-09-11T05:20:57+05:30

బిగ్‌బాస్‌ రియాలిటీ షోను దేశవ్యాప్తంగా నిషేధించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ నేతల ఆందోళన 

నెల్లూరు(వైద్యం)సెప్టెంబరు 10 : బిగ్‌బాస్‌ రియాలిటీ షోను దేశవ్యాప్తంగా నిషేధించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని అజాద్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ ఆందోళనలో సీపీఐ జిల్లా నేత సయ్యద్‌ సిరాజ్‌ మాట్లాడారు. ఈ రియాలిటీ షో వల్ల మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అది బిగ్‌ బాస్‌ హౌస్‌ కాదని, ఇది బూతుల హౌస్‌ అన్నారు. ఆడవారు, మగవారు ఒకరికి ఒకరు సంబంధం లేని వారు ఒకే ఇంట్లో ఉండటం ఇష్టాను సారంగా మాట్లాడటం, ఒకరినొకరి తిట్టుకోవటం ఏడవటం, గొడవలు పడటం, వికృత చేష్టలు చేయటం వంటివి టీవీలో ప్రసారం అవుతున్నాయన్నారు. డబ్బు సంపాదించు కోవాటానికి, టీఆర్పిని పెంచుకోటానికి చేస్తున్న ఇలాంటి రియాల్టీని షోలను నిషేధించాలని కోరారు.  ఇలాంటి షోల వల్ల భారతదేశ సంస్కృతికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నారు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గోపాల్‌, మధు, మున్నా, మస్తాన్‌, గయాజ్‌, హాజీ, అలీ, గౌస్‌, ముత్యాలు, ఫైరోస్‌, కిశోర్‌, షంషేర్‌, సుభాని, ఇనాయత్‌ 

Updated Date - 2022-09-11T05:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising