ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN, First Publish Date - 2022-01-22T04:32:25+05:30

జిల్లా వ్యాప్తంగా 10 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధితులకు అక్కడే చికిత్స : డీఎంహెచవో

రెండో రోజూ వెయ్యి దాటిన కేసులు

సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి కరోనా


నెల్లూరు(వైద్యం), జనవరి 21 : జిల్లా వ్యాప్తంగా 10 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి కరోనా లక్షణాలు ఉన్న వారికి ఆయా కేంద్రాల్లో చికిత్సలు అందిస్తారన్నారు. అలాగే హెల్ప్‌ డెస్క్‌లో ఆసుపత్రి అడ్మిషన్స, పడకల కేటాయింపు, డిశ్చార్జ్‌ వివరాలు నమోదు చేసుకుంటార న్నారు. తాగునీరు. ఆహారం మెనూ ప్రకారం అందచేస్తారన్నారు. పారిశుధ్య సిబ్బంది, 108 అంబులెన్స సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో నోడల్‌ అధికారి పర్యవేక్షణలో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు. 


ఎక్కడెక్కడ... ఎన్ని పడకలు


గూడూరులోని ఏపీ టిడ్కో ఇళ్లలో 160 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఆత్మకూరులోని టిడ్కో ఇళ్లలో 128 పడకలు, నెల్లూరులోని అల్లీపురంలో ఉన్న టిడ్కో ఇళ్లలో 32 పడకలు, కావలి టిడ్కో భవనాల్లో 128 పడకలు, నాయుడు పేటలోని టిడ్కో భవనాల్లో 96 పడకలు, డీటీసీ బుజబుజనెల్లూరులో 100 పడకలు, నారాయణ స్కూల్‌ 100 పడకలు, సీసీసీ వింజమూరు 50 పడకలు, గొట్టికొండ బీఈడీ కళాశాల 50 పడకలు, సీసీసీ నేలటూరు 100 పడకలు ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ప్రకటించారు. 


1051 కరోనా కేసులు


నెల్లూరు(వైద్యం/వీఆర్సీ): జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడో వేవ్‌ మొదలైనప్పటి నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 1051 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,423కు చేరింది. తాజాగా కొవిడ్‌ నుంచి కోలుకున్న 126 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. 28,329 మందికి వ్యాక్సిన వేశారు. కాగా, సాంఘిక సంక్షేమ శాఖ ఇనచార్జి డీడీ యూ చెన్నయ్య కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం నుంచి హోం ఐసోలేషనలో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-01-22T04:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising