ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలి

ABN, First Publish Date - 2022-08-09T04:11:54+05:30

కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రం సమర్పిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, ఆగస్టు 8 : కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని సీపీఎం నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గండవరపు శేషయ్య మాట్లాడుతూ పాటూరు - కోవూరు మధ్య చెరువు కలుజు పై వర్షాకాలం మొదలైనప్పటి నుంచి గాంధీ సంఘం, గుమ్మలదిబ్బ, పల్లిపాలెం, పాటూరు, యల్లాయపాలెం, రేబాల, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముంబై జాతీయ రహదారి లింక్‌ రోడ్డు మీదుగా ప్రభుత్వ కార్యాలయాలకు, కోర్టుకు, కూలి పనులకు, కూరగాయలు పండించే రైతులు రహదారిపై వెళ్లేటప్పుడు ఇబ్బందులు  పడుతున్నారన్నారు. వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణానికి ఇబ్బంది కలుగుతోందన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మారుబోయిన సుబ్బారావు, ఖాదర్‌బాషా, బుజ్జయ్య, సురేష్‌, సర్ధార్‌ అహ్మద్‌, కాలేషా, శ్రీనివాసులు, అప్రోజ్‌, బాబు, కరిముల్లా, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T04:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising