ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీ చెయ్యాలి

ABN, First Publish Date - 2022-07-08T03:56:24+05:30

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చెయ్యాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(వైద్యం), జూలై 7: వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చెయ్యాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, కమిషనర్‌ శ్రీనివాస్‌ నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేసిన వారితో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెట్టి మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి లార్వా దశలోనే వాటిని నివారించాలని సూచించారు. ఎక్కడ ఎక్కువగా వ్యాధులు ప్రబలుతున్నాయో అయా ప్రాంతాలపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-08T03:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising