ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎ్‌సపై నిర్లక్ష్యం వహిస్తే సహించం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-01-18T03:48:29+05:30

ఓటీఎ్‌స లక్ష్యసాధనలో అల్లూరు వెనుకబడి ఉందని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు.

అధికారులు, స్థానికులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ .చక్రధర్‌బాబు, ఎమ్మెల్యే రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, జనవరి 17 : ఓటీఎ్‌స లక్ష్యసాధనలో అల్లూరు వెనుకబడి ఉందని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డితో కలిసి సోమవారం మండలంలో పర్యటించిన కలెక్టర్‌ ముందుగా నార్తుమోపూరు సచివాలయాన్ని పరిశీలించి ఓటీఎ్‌స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి సక్రమమైన సమాధానం రాకపోవడంతో జిల్లాలో కావలి డివిజన్‌ వెనుకబడి ఉందని, అందులో అల్లూరు మరింత వెనుకబడి ఉందని కలెక్టర్‌ అన్నారు. దీనికి గల కారణాలను అదికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎంతోకాలంగా ఆగిపోయి ఉన్న ప్రధాన రహదారిని పరిశీలించారు. లబ్ధిదారుడికి నష్టపరిహారం ఇచ్చినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజలు అహర్నిశలు ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్నారని ఎమ్మెల్యే కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. రెండువైపులా రాకపోకలు సాగక పడుతున్న ఇబ్బందులను  కలెక్టరు స్వయంగా పరిశీలించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. 

వైద్య సిబ్బంది కొరత : అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకలుగా రూపాంతరం చేసి అన్ని హంగులతో భవనాన్ని నిర్మించుకున్నాం. కానీ ఇప్పటికీ సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే వర్షాకాలంలో ఆసుపత్రి ఆవరణమంతా నీటితో నిండిపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటే భవనంపైన భవనం కట్టుకుంటూ పోతున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఐదుగురు ప్రధాన వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రిలో ఒక్కరు మాత్రమే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్‌, తహసీల్దారు శ్రీరామకృష్ణ, స్థానిక నాయకులు నీలం సాయికుమార్‌, సామంతుల సురే్‌షరెడ్డి, మేడ కృష్ణారెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

Updated Date - 2022-01-18T03:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising