ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త ఒకచోట.. కేంద్రాలు మరోచోట

ABN, First Publish Date - 2022-01-28T05:09:08+05:30

గ్రామాల్లో ఇళ్లలోంచి వచ్చే చెత్త, వ్యర్థాలతో వర్మికంపోస్టు తయారుచేసి ఆ ఎరువును ప్యాకెట్ల రూపంలో విక్రయించి, తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకునే ఉద్దేశంతో చెత్త సంపద తయారీ కేంద్రాలను తీసుకువచ్చారు.

చెరుకుమూడిలో నిరుపయోగంగా చెత్త సంపద తయారీ కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇలా అయితే వర్మికంపోస్టు తయారీ ఎలా?

పంచాయతీలకు ఆదాయం సమకూరేనా? 


మనుబోలు, జనవరి 27 : గ్రామాల్లో ఇళ్లలోంచి వచ్చే చెత్త, వ్యర్థాలతో వర్మికంపోస్టు తయారుచేసి ఆ ఎరువును ప్యాకెట్ల రూపంలో విక్రయించి, తద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకునే ఉద్దేశంతో చెత్త సంపద తయారీ కేంద్రాలను తీసుకువచ్చారు. దీనికి గత ప్రభుత్వ హయాంలోనే బీజం పడింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి పంచాయతీలో ఉపాధి నిధులతో వీటిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఆరంభశూరత్వమనే చెప్పాలి. మరుగున పడిఉన్న కేంద్రాలను మరలా వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికార యం త్రాంగం కొంతకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నా ఏ మాత్రం ఆచరణ సాధ్యం కావడం లేదు. కేంద్రాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ అంబాసిడర్లును కేటాయించి వారికి ఏళ్లతరబడి జీతాలు అందిస్తోం ది. అయితే ప్రస్తుతం వారిని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులుగా కొనసాగిస్తున్నారు.  

మండలంలో ఇప్పటివరకు 15 పంచాయతీల్లో మాత్రమే చెత్తసంపద కేంద్రాలను నిర్మించారు. నాలుగు పంచాయతీల్లో స్థలం చూప కపోవడంతో వాటి నిర్మాణాలు జరగలేదు. ఒక్కో పంచాయతీలో ఈ కేంద్రాల నిర్మాణాలకు రూ.3లక్షల నుంచి 5లక్షల ఉపాధి నిధులు ఖర్చు చేశారు. ఇటీవల పంచాయతీ నిధులతో కొత్త రంగులు వేయించారు. మొత్తం మీద  ఒక్కో కేంద్రా ని కి దాదాపుగా రూ. 5ల క్షలు ఖర్చు పెట్టారు. 15 పంచాయతీలతో కలిపి మండలంలో రూ. 75లక్షలు వెచ్చించారు. అయితే ఇప్పటికీ ఏ పంచాయతీలోనూ ఈ కేంద్రాల ద్వారా ఒక్క రూపాయి కూడా ఆదాయం సమకూరలేదు.


ఎక్కడ పడితే అక్కడే చెత్త

ఈ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు ఒక్కో పంచాయతీలో 50 సెంట్ల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలం కేటాయించారు. కాగా ఇళ్లవద్ద సేకరించిన చెత్తను కేంద్రాలకు చేరవేయకుండా దగ్గర్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లోనూ, చెరు వులు, కాలువల వద్ద గుట్టగా పోస్తున్నారు. ఇలాగైతే  చెత్త చేరకుం డా సంపద ఎలా సృష్టిస్తారో అధికార యంత్రాంగానికే తెలియాలి.


15 కేంద్రాలకు 47మంది గ్రీన్‌అంబాసిడర్లు

మండలంలో ఉన్న 15 చెత్త సంపద తయారీ కేంద్రాల్లో పనిచే సేందుకు ప్రభుత్వం 47మంది గ్రీన్‌ అంబాసిడర్లను నియమించింది. ఇదంతా రికార్డుల్లో మాత్రమే. వీరంతా కేంద్రాల్లో ఎక్కడా కనిపించరు. ఎందుకంటే వారే పారిశుఽధ్య కార్మికులుగా ఉన్నారు. వీటి పరిశీలనకు నాలుగురోజులకొకసారి ఒక్కో అధికారి రావడం, కేంద్రాలను పరిశీలించడం, ఫొటోలు తీసుకువెళ్లడం తప్ప తనిఖీల ద్వారా కేంద్రాల నిర్వహణలో ఎలాంటి మార్పు కానరావడం లేదు .గతేడాది డిసెంబరు 24న మనుబోలు కేంద్రాన్ని జేసీ గణేణ్‌కు మార్‌, ఈ నెల 8న జడ్పీ సీఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. ఇక అక్కంపేట పంచాయతీలో ఉన్న కేంద్రాన్ని ఈ నెల 11న గూడూరు డీఎల్‌పీవో వెంకటరమణ పరిశీలించారు. అక్కడా ఇదే పరిస్ధితి. ఇకనైనా కేంద్రాల నిర్వహణపై దృష్టిపెట్టేలా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





Updated Date - 2022-01-28T05:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising