ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుచ్చిలో బైక్‌ మెకానిక్‌ షెడ్డు దగ్ధం

ABN, First Publish Date - 2022-01-28T05:15:34+05:30

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ బైక్‌ మెకానిక్‌ షెడ్డు దగ్ధం కాగా.. అందులోని 3బైక్‌లు, స్పేర్‌పార్ట్స్‌ కాలిపోయిన ఘటన గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి పక్కన ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది.

బుచ్చిలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌కు దగ్ధమవుతున్న బైక్‌ మెకానిక్‌ షెడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిపోయిన 3 బైక్‌లు, స్పేర్‌పార్ట్స్‌ 

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో  ప్రమాదం  


బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 27: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ బైక్‌ మెకానిక్‌ షెడ్డు దగ్ధం కాగా.. అందులోని 3బైక్‌లు, స్పేర్‌పార్ట్స్‌ కాలిపోయిన ఘటన గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి పక్కన ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. శ్రీమణికంఠ బైక్‌ మెకానిక్‌ వర్క్స్‌ యజమాని పవన్‌కల్యాణ్‌కు ఉదయం 6 గంటల సమయంలో తన షెడ్డులోనుంచి పొగలు వస్తున్నాయన్న సమాచారం రావడంతో వెళ్లి షెడ్డు షట్టర్‌ ఎత్తి చూడగా.. విద్యుత్‌ మెయిన్‌ బోర్డులో నుంచి మంటలు రేగుతుండడం కింద ఉన్న బైక్‌లు, స్పేర్‌పార్ట్స్‌లో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి భయంతో షట్టర్‌ దించేశాడు. అప్పటికే అక్కడ జనం గుమిగూడారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ఎక్స్‌కవేటర్‌ సాయంతో  షెడ్డు షట్టర్‌ను పైకి లేపారు. దీంతో మంటలు అధికమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో వారు హూటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసినా అప్పటికే అన్ని కాలి కరిగిపోయాయి. సుమారు 6లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ధాటికి బిల్డింగ్‌కు పలుచోట్ల బీటలు వారాయి. బుచ్చి ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. 


 

Updated Date - 2022-01-28T05:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising