ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలపాతంలో బాలుడు గల్లంతు

ABN, First Publish Date - 2022-08-07T05:24:23+05:30

ఘాట్‌రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో ఒక బాలుడు గల్లంతైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్ట (రాజరాజేశ్వరి గుడి)కి చెందిన పలువురు యువకులు శనివారం సిద్ధిలేశ్వరకోనకు వచ్చినట్టు సమాచారం.

గల్లంతైన బాలుడు శశికుమార్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, ఆగస్టు 6: ఘాట్‌రోడ్డులోని సిద్దిలేశ్వరకోన జలపాతంలో ఒక బాలుడు గల్లంతైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్ట (రాజరాజేశ్వరి గుడి)కి చెందిన పలువురు యువకులు శనివారం సిద్ధిలేశ్వరకోనకు వచ్చినట్టు సమాచారం. యువకులంతా కలసి ఇక్కడి జలపాతంలో స్నానాలు చేశారు. వారిలో శశికుమార్‌ (16) నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. శశికుమార్‌ అన్న రాజేష్‌తోపాటు వచ్చినవారందరూ వెతికినా ప్రయోజనం లేదని తెలిసింది. సాయంత్రం 6గంటలకే ఈ విషయం తెలియడంతో పోలీసులు, అటవీశాఖ, ఫైర్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు సిద్ధం అయ్యారు. అంతలోనే వచ్చినవారందరూ ఉన్నట్లు తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాత్రి 9గంటల ప్రాంతంలో శశికుమార్‌ తండ్రైన ఆటో డ్రైవర్‌ రాపూరులో తెలిసిన వారందరికీ ఫోన్‌ చేసి తన బిడ్డ రాలేదని చెప్పడంతో ఈ విషయం కాస్త వెలుగుచూసింది. ఈ విషయాన్ని  జేసీ దృష్టికి బాధితులు శనివారం రాత్రి  తీసుకువెళ్లినట్లు సమా చారం. గల్లంతైన బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రాపూరుకు వస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2022-08-07T05:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising