ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోగోలులో ప్రపంచ ఆదివాసి దినోత్సవం

ABN, First Publish Date - 2022-08-10T04:17:08+05:30

బోగోలులో మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం గిరిజన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఏకలవ్య విగ్రహానికి పూలమాలు వేస్తున్న గిరిజన నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట, ఆగస్టు 9: బోగోలులో మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం గిరిజన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘాల జేఏసీలు సంయుక్తంగా తిప్ప రామాపురం కూడలిలోని ఏకలవ్య విగ్రహానికి పూల మాల వేసి జేజేలు పలికారు. గిరిజన సంఘాల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాటి క్రాంతి కుమార్‌, ఏఐవైహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఇట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన తిప్ప జాతీయ రహదారి నుంచి బోగోలు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోగోలు  కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల దావీదు, ఏఐవైహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఎస్టీ సెల్‌ లీగల్‌ అడ్వవైజర్‌ గుర్రంకొండ సర్దార్‌, బీజేపీ జిల్లా ఎస్టీసెల్‌ నేత ఎస్‌.వెంకటేశ్వర్లు, బోగిరి యోహాను, దేవరకొండ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కప్పరాళ్ళతిప్ప గ్రామ ఎరుకుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బోగోలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవుల దావీదు,  ఆకుల డేవిడ్‌ పాల్‌, వైసీపీ మండల ఎస్టీసెల్‌ అధ్యక్షుడు మేకల.సాల్మన్‌రాజు, వరప్రసాద్‌, గుంజ.బాబు, పీట్ల.మహేష్‌, జ్యోషి, విజయ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-08-10T04:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising