ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టులో మెగా రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2022-06-25T04:37:37+05:30

అదానీ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 60వ జన్మదిన సందర్భంగా అదానీ కృష్ణపట్నం పోర్టు పరిధిలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదానం చేస్తున్న పోర్టు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

562 మంది రక్తదానం

ముత్తుకూరు, జూన్‌ 24: అదానీ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 60వ జన్మదిన సందర్భంగా అదానీ కృష్ణపట్నం పోర్టు పరిధిలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రికార్డు స్థాయిలో 562 మంది రక్తదానం చేశారు. పోర్టు సీఈవో అవినాష్‌ చంద్‌రాయ్‌ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అన్ని దానాల్లోకి రక్తదానం ఎంతో విలువైందన్నారు.  పోర్టు ప్రాజెక్టు కార్యాలయం, సీవీఆర్‌ వైద్యశాల, అదానీ పామాయిల్‌ పరిశ్రమ ప్రాంగణాల్లో నిర్వహించిన శిబిరాల్లో 562 మంది పోర్టు ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేశారని తెలిపారు. పోర్టులో కేకు కట్‌ చేసి ఉద్యోగులకు, కార్మికులకు పంచిపెట్టారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పోర్టు సీవోవో సంజయ్‌, మోహిత్‌ షెకావత్‌, అడ్మిన్‌ హెడ్‌ గణేష్‌ శర్మ, పీఆర్‌ హెడ్‌ జి.వేణుగోపాల్‌, సేఫ్టీ హెడ్‌ సైఫీ, ఈహెచ్‌ఎస్‌ హెడ్‌ వేణుగోపాల్‌, వివిధ విభాగాల అధికారులు, రెడ్‌క్రాస్‌ కన్వీనర్‌ అజయ్‌బాబు, లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T04:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising