ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూగర్భ జలం.. పెంపే లక్ష్యం

ABN, First Publish Date - 2022-07-05T05:47:01+05:30

ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో క్యాచ్‌ ద రైన్‌ 2022 కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఇ.రవీందరన్‌ పేర్కొన్నారు.

మామిడి, జామ చెట్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, జూలై 4 : ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో క్యాచ్‌ ద రైన్‌ 2022 కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఇ.రవీందరన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన జలశక్తి అభియాన్‌ శాస్త్రవేత్త రూపేష్‌ కుమార్‌, జిల్లా డ్వామా పీడీ తిరుపతయ్యతో కలిసి సోమవారం సంగం, వింజమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి తదితర మండలాల్లో పర్యటించారు. సంగం మండలంలోని వెంగారెడ్డిపాళెం, సంగం గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద చేపట్టిన మామిడి, జామ సాగును వారు పరిశీలించారు. నాటిన మొక్కలు ఎన్ని సంవత్సరాలకు ఫలాలు ఇస్తాయి, నీటి సదుపాయం, ఎన్ని అడుగుల్లో నీరు పడుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీందరన్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. కేంద్ర బృందం వెంట ఎంపీడీవో సుజాత, ఏపీవో శ్రీనివాసరావు, వెంగారెడ్డిపాళెం సర్పంచు ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-05T05:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising