ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ జనగణన జరిగే వరకు పోరాటం

ABN, First Publish Date - 2022-03-06T03:13:45+05:30

దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన జరిగే వరకు బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకరరావు గౌడ్‌ స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు గౌడ్‌

కావలి, మార్చి 5: దేశ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనగణన జరిగే వరకు బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకరరావు గౌడ్‌ స్పష్టం చేశారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో శంకరరావు గౌడ్‌, రాష్ట్రప్రధాన కార్యదర్శి అన్నవరపు మల్లేశ్వరరావు, యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్‌, సమన్వయ కమిటీ కార్యదర్శి బ్రహ్మానంద శర్మ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ప్రతి పదేళ్లకొకసారి జనగణన చేపట్టాలని చట్టం చెపుతుందన్నారు. బీసీ గణన చేపడితే రాజకీయంగా మా పర్సంటేజీతో మావాటా ఎంత, మా సంక్షేమం ఎంత అని కూడా తేలుతుందన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా 18 పార్టీలు, 8 రాష్ట్రాలు ఓబీసీ జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్‌ చేసినా కేంద్రం దానిపై దృష్టి సారించలేదన్నారు. ప్రధాని మోదీ బీసీ కులానికి చెంది కూడా ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్న బీసీలు కూడీ బీసీల సమస్యల గురించి పట్టించుకోలేదని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా బీసీ మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఆదివారం కడపలో ఆ తర్వాత  అనేక జిల్లాలో బీసీ జనగణనపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు, నేతలు చిలకపాటి మాల్యాద్రి, పీ పెనుగొండయ్య గౌడ్‌, జంపాని వంశీ, రవీంద్ర, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T03:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising