ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యతతోనే బలిజల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-01-03T03:31:04+05:30

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన బలిజల అభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగుదామని రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరాయలు పిలుపునిచ్చారు.

పేద విద్యార్థులకు నగదు అందజేస్తున్న ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరాయలు 

నెల్లూరు(వీఆర్సీ), జనవరి 2: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో  వెనుకబడిన బలిజల అభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగుదామని రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరాయలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని ఏనుగు సుందర రామిరెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం బలిజ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ఆరు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల  సీమ జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశంలో బలిజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. బలిజ విద్యార్థులను ప్రోత్సహించి విద్యారంగంలో రాణిస్తే అన్ని రంగాల్లో మనమే ముందుంటామన్నారు. అనంతరం పేద బలిజ విద్యార్థులు 20 మందికి ఒక్కొక్కరికి మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ రూ.5 వేల, రెండు జతల దుస్తులు అందజేశారు. అలాగే బలిజల నూతన క్యాలెండర్‌ ఆవిష్కరించారు. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అంద జేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట హజరత్తయ్య, రామిశెట్టి  వెంకటసుబ్బయ్య, నాయుడు శ్రీహరి రాయలు, ఏపీ ఫారెస్ట్‌ అభివృద్ధి కమిటీ సభ్యుడు వై.రమేష్‌, సీడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొణిదల సుధీర్‌ త దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T03:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising