ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడుగుల ఆశాజ్యోతి జగజ్జీవన్‌రామ్‌ : ఎమ్మెల్యే రామిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-07T03:05:19+05:30

మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్‌ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొ

నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జూలై6:  మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్‌ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జగజ్జీవన్‌రామ్‌ 36వర్ధంతి సందర్భంగా  పట్టణంలోని ఎమ్పీడీవో కార్యాలయం ఎదురుగా ట్రంకురో డ్డులోని ఉన్న జగజ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద పలువురు ఘననివాళులు అర్పించారు. ఎమ్మెల్యే  వైసీపీ నేతలతో కలిసి జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ పందిటి కామరాజు, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి నారాయణ, అక్కెలగుంట మాల్యాద్రి, పరుసు మాల్యాద్రి, తిరివీధి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ ఆధ్వర్యంలో..


 కావలి టీడీపీ ఎస్సీసెల్‌ నేతలు దావులూరి దేవకుమార్‌, అక్కెలగుంట సూరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతలు జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జ్యోతి బాబురావు, కాకి ప్రసాద్‌, ఆత్మకూరి నాగరాజు,  మన్నవ రవిచంద్ర,  తటవర్తి వాసు, మంచాల ప్రసాద్‌, రాము, రఫీ తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మార్పీఎస్‌ ఆద్వర్యంలో..


ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నేతలు జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షుడు కిరణ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు జీ వెంకటేశ్వర్లు, మందా వెంకటేశ్వర్లు,  అక్కెలగుంట ఏసు, వరప్రసాద్‌, కత్తి శివయ్య, సామేలు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


 బిట్రగుంటలో..


బిట్రగుంట : ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ను నేతలు ఆదర్శంగా తీసుకోవాలని రామిశెట్టి వెంకట సుబ్బారావు ట్రస్ట్‌ నిర్వాహకురాలు మెతుకు రాజేశ్వరి అన్నారు. బోగోలులోని ఆమె స్వగృహంలో బుధవారం జగ్జీవన్‌రామ్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఓంశ్రీనాయుడు, నరసింహరావు, మోహన్‌రావు, కావలి శ్రీను, బాబురావు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-07T03:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising