ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైశాచిక ఆనందం కోసమే లోకేష్‌పై దుష్ప్రచారం

ABN, First Publish Date - 2022-08-05T05:09:05+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం కోసమే టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య అన్నారు.

పొదలకూరు :పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోవూరు, ఆగస్టు 4: సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పైశాచిక ఆనందం కోసమే టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య అన్నారు. కోవూరు నియోజకవర్గ  టీడీపీ నాయకులు గురువారం  స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సదర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందేనన్నారు. ఆమె మరణానికి నారాలోకేష్‌ కారణమని అసత్య ప్రచారం చేస్తూ  దేవేందర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ విష ప్రచారానికి విజయసాయిరెడ్డి వత్తాసు పలకడడం అత్యంత హేయమైన చర్య అన్నారు. వెంటనే దేవేందర్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇంతా మల్లారెడ్డి, బాలరవి, నాటక రాణి వెంకట్‌, బెల్లంకొండ విజయ్‌కుమార్‌, వికుమార్‌ పాల్గొన్నారు.

నిందలు మోపుతూ దుష్ప్రచారం 

 టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నాయకులు నిందలు మోపుతూ దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాదరణ పొందుతున్న తమ నేత లోకేష్‌కు వైసీపీ నాయకులు బెంబేలెత్తి ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన కోరారు. 

 పోలీసుస్టేషన్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల నిరసన

పొదలకూరురూరల్‌, ఆగస్టు 4 : ఎన్టీర్‌ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై శవ రాజకీయాలు  తగవని, చంద్రబాబు, లోకేష్‌లపై ఆధారాల్లేని పోస్టులు పెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ దేవేందర్‌రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయాలని స్టేషను ముందు నిరసన తెలిపారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ కారణమని వైసీపీ నాయకులు ఆరోపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జడపల్లి సూర్య, తెలుగు యువత నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చంద్ర, జహీర్‌, మురళి, ప్రభాకర్‌, దేవినేని శరత్‌, రోహిత్‌, తెలుగు మహిళా నాయకులు సుగుణమ్మ, అరుణమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T05:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising