ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్సాం సీఎం దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2022-02-14T05:07:56+05:30

కాంగ్రెస్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వాశర్మ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాహుల్‌గాంధీపై అనుచిత వాఖ్యలకు కాంగ్రెస్‌ నిరసన

 మోదీ ప్రభుత్వానివి విలువలు లేని నీచ రాజకీయాలు: చేవూరు

నెల్లూరు (వైద్యం) ఫిబ్రవరి 13 : కాంగ్రెస్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వాశర్మ చేసిన అనుచిత వాఖ్యలను   ఖండిస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.   ఆదివారం స్థానిక ఫూలే బొమ్మ వద్ద  ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతీ సాంప్రదాయం, కీర్తి ప్రతిష్టలను మంటగలిపేలా మోదీ ప్రభుత్వం విలువ లేని నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో ఎన్నడూ లేనంతగా దేశంలో అలజడి, విద్వేషాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయన్నారు. రాహుల్‌గాంధీ పుట్టుక గురించి మాట్లాడే ముందు తన పుట్టుక గురించి, అందుకు కారణమైన వారి గురించి అస్సాం ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే హిమంత్‌ బిస్వాశర్మను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇతరుల కుటుంబాలను రచ్చకీడ్చటం, స్త్రీలను కించ పరిచేలా వాఖ్యలు చేస్తే ఎంతటి స్థాయి వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకోవాలని చట్టాలు చెబుతున్నాయన్నారు. దీనికి అనుగుణంగా అస్సాం ముఖ్యమంత్రిని ప్రధాని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు ఫయాజ్‌, గణేష్‌బాబు, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-14T05:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising