ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌

ABN, First Publish Date - 2022-10-08T04:52:54+05:30

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు.

ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్న జనసైనికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌


ఆత్మకూరు, అక్టోబరు 7 : వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. ‘పవనన్న ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని ఎస్టీ కాలనీలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మోసం, సీపీఎస్‌ రద్దులేదు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా కరెంటు బిల్లుల మోత.. ఇలా అన్నివిధాల అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలు గోచరిస్తున్నాయని పేర్కొన్నారు. ఆత్మకూరులో పరిశ్రమల స్థాపనకు పోరాడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్‌, చైతన్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising