ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పుడే జలకళ... మరి వరదలు వస్తే ఎలా ?

ABN, First Publish Date - 2022-08-09T02:41:53+05:30

వర్షాలకు ముందే అనూహ్యంగా వస్తున్న వరదతో సోమశిల జలాశయం పూర్తిసామర్థ్యానికి చేరువతోంది. దీంతో ఇప్పుడే

జలాశయం ముందు జరుగుతున్న ఆఫ్రాన్‌ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

65 టీఎంసీలు దాటిన సోమశిల

 పెరుగుతున్న ఇన్‌ఫ్లో

అసంపూర్తిగా అభివృద్ధి పనులు

అనంతసాగరం, ఆగస్టు 8: వర్షాలకు ముందే అనూహ్యంగా వస్తున్న వరదతో సోమశిల జలాశయం పూర్తిసామర్థ్యానికి చేరువతోంది. దీంతో ఇప్పుడే సోమశిల జలకళను సంతరించుకోగా, మరి భారీ వరదలు వస్తే పరిస్ధితి ఎలా వుంటుందో తలుచుకుని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమశిల పూర్తిసామర్ధ్యం 78 టీఎంసీలు కాగా, సోమవారం నాటికి 65 టీఎంసీలకు చేరుకొంది. ఇక జలాశయం నిండేందుకు 15 టీఎంసీలు మాత్రమే అవసరం. కాగా పైతట్టు ప్రాంతాల నుంచి సోమశిలకు 20,668 క్యూసెక్కుల వరద చేరుతుంది. అంటే రోజు వారీగా సుమారు 1.90 టీఎంసీల నీరు చేరుతోంది. ఈలెక్కన మరో వారంలో జలాశయం నిండే సూచనలు ఉన్నాయి. ఇక సోమశిల దిగువున చివరిదశ నిర్మాణంలో ఉన్న సంగం, నెల్లూరు భ్యారేజీలు ప్రారంభించినా, రెండు చోట్ల కలపి 2.5టీఎంసీలకు మించి నిలువరించే పరిస్ధితి లేదు. ఈక్రమంలో రానున్న వర్షాల సమయం కీలకం కావడంతో అధికారులు అప్రమత్తతే శ్రీరామరక్ష కానుంది. 


 నేడు కండలేరుకు నీటి విడుదల


సోమశిల నుంచి కండలేరుకు మంగళవారం నుంచి నీటి విడుదలకు అదికారులు చర్యలు చేపట్టారు. ఎగువ నుంచి సోమశిలకు వచ్చే వరదలో తెలుగుగంగ కాలువ ద్వారా 1000 నుంచి 1500 క్యూసెక్కులు సరఫరా చేసేలా ప్రణాళిక  రూపొందించారు. కొన్ని రోజులుగా కాలువ  తూములు సరిచేసి అడ్డంకులు తొలగించే పనులను అధికారులు చేపట్టారు.


 పూర్తికాని పనులు


గత రెండేళ్ల కాలంలో వచ్చిన భారీ వరదలతో సోమశిల కట్టడాలు చిన్నాభిన్నమయ్యాయి. భూకంపాన్ని తలపించేలా ఆఫ్రాన్‌ ప్రాంతం రూపురేఖలు కోల్పోయింది. ప్రధాన కట్టడాలు సైతం బలహీన పడ్డాయి. దీంతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ 99.11 కోట్లు మంజూరు చేయగా, ఆ నిధులతో పనులకు ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు. ఈపనులు మే నుంచి జరుగుతున్నా ఇప్పటికి 20 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రధానంగా స్లూయిజ్‌ వద్ద డైవర్షన్‌వాల్‌ గత వరదలకు కోతకు గురైంది. జరుగుతున్న పనుల తీరును  చూస్తే వరదల నాటికి  పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఆఫ్రాన్‌ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. వరదలోపు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి.



Updated Date - 2022-08-09T02:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising