ఏపీజీబీకి ఇంటి యజమాని తాళం
ABN, First Publish Date - 2022-12-16T23:09:16+05:30
అగ్రిమెంట్ ప్రకారం తమకు పెంచి ఇవ్వాల్సిన అద్దె ఇవ్వకుండా, ఇంటిని ఖాళీ చేయకుండా బ్యాంకు ఉన్నాతాధికారులు తొమ్మిది నెలలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంటి యజమాని ఆరికట్ల విజయమ్మ శుక్రవారం కలువాయిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)కి తాళం వేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలువాయి, డిసెంబరు 16 : అగ్రిమెంట్ ప్రకారం తమకు పెంచి ఇవ్వాల్సిన అద్దె ఇవ్వకుండా, ఇంటిని ఖాళీ చేయకుండా బ్యాంకు ఉన్నాతాధికారులు తొమ్మిది నెలలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంటి యజమాని ఆరికట్ల విజయమ్మ శుక్రవారం కలువాయిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)కి తాళం వేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల మేరకు.. కలువాయికి చెందిన ఆరికట్ల విజయమ్మ తన ఇంటిని 2002 ఫిబ్రవరిలో ఏపీబీజీకి అద్దెకు ఇస్తూ 5 ఏళ్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ మేరకు ఐదేళ్ల తరువాత అదే ఇంట్లో బ్యాంకును కొనసాగించాలంటే 25శాతం అద్దె పెంచుతూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాలని అందులో పొందుపర్చారు. ఆ విధంగా 2017 వరకు 3 దఫాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. 2017లో చేసుకున్న అగ్రిమెంట్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఐదేళ్లు పూర్తయింది. అగ్రిమెంటు గడువు ముగిసిపోవడంతో అప్పటి నుంచి తొమ్మిది నెలలుగా ఆమె బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతూ తనకు అద్దె పెంచుతూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాలని, లేకుంటే ఇల్లు ఖాళీ చేయాలని కోరుతున్నా బ్యాంకు అధికారులు అదేమి పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయమై బ్యాంక్ మెనేజర్‌తో పాటు ఉన్నాతాధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేశానని ఆమె తెలిపారు. లాయర్ ద్వారా బ్యాంక్ అధికారులకు నోటీసు కూడా ఇచ్చారు. అయినా బ్యాంక్ ఉన్నాతాధికారులు తమను ఇబ్బందులు పెడుతూ నాపైనే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ బ్యాంక్‌కు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో విధులకు హాజరైన సిబ్బంది బ్యాంకు బైట నిరీక్షించారు. మధ్యాహ్నం వరకు లావీదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా బ్యాంక్‌కు యజమాని తాళం వేసిన విషయం ఉన్నాతాధికారులకు తెలియజేశామని బ్రాంచి మెనేజర్ వీ.కృష్ణ తెలిపారు. అద్దె పెంపు ప్రాసె్‌సలో ఉన్నట్లు ఉన్నాతాధికారులు చెప్పారని ఆయన తెలియజేశారు. దీంతో బ్యాంక్ ఉన్నాతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఇంటి యజమానికి పోలీసులు హామీ ఇవ్వడంతో ఆమె తాళం తీశారు.
Updated Date - 2022-12-16T23:09:18+05:30 IST