ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-05-21T04:25:40+05:30

మండలంలోని జొన్నవాడలో శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా పునర్నించిన ఆలయంలో ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌

బుచ్చిరెడ్డిపాళెం, మే 20 : మండలంలోని జొన్నవాడలో శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా పునర్నించిన ఆలయంలో ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, స్థానిక సర్పంచు, పాలకమండలి చైర్మన్‌, సభ్యులు పాల్గొన్నారు. పల్లిపాడుకు చెందిన దాతలు నెల్లూరు రవీంద్రరెడ్డి, రాధమ్మ సహకారంతో రూ.15 లక్షలతో పునర్నించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆలయ అర్చకులు  హనుమాన్‌ ఆచార్యులు, శేషాచార్యులతోపాటు పలువురు పండితులు శాస్ర్తోక్తంగా మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, అన్నదాన వితరణ కార్యక్రమాలకు చిద్రూపరెడ్డి, లక్ష్మీప్రసన్న, కాటంరెడ్డి శంతన్‌రెడ్డి, కళాప్రసన్న ఉభయదాతలుగా వ్యవహరించారు. అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  జొన్నవాడ వద్ద పెన్నానది పొర్లుకట్టలను పరిశీలించారు.

Updated Date - 2022-05-21T04:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising