ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: చెల్లి వరసయ్యే అమ్మాయిపై కన్నేశాడు...

ABN, First Publish Date - 2022-09-27T20:15:55+05:30

పదోతరగతి విద్యార్థినిపై కన్నేశాడు. బాత్ రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి లైంగికంగా వేధిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): పదోతరగతి విద్యార్థినిపై కన్నేశాడు. బాత్ రూంలో స్నానం చేస్తుండగా వీడియో తీసి లైంగికంగా వేధిస్తున్నాడు. చెప్పిన మాట వినకుంటే సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. చివరికి సీఎం కార్యాలయంలో మొరపెట్టుకున్నా రక్షణ లభించకపోవడంతో ఆ కుటుంబం అనుక్షణం భయపడుతోంది.


వరుసకు అన్న అవుతాడు... కానీ వావీ వరుస మరిచి కామంతో చెలరేగిపోతున్నాడు. చెల్లెలు లాంటి అమ్మాయిని చెరపట్టాలని చూస్తున్నాడు. పోలీసులు, నేతల పలుకుబడితో ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడు. నెల్లూరు నాలుగోమైలు ప్రాంతంలో రౌడీషీటర్ అగాయిత్యాలకు గురైన బాధిత కుటుంబం తమను కాపాడాలని కలెక్టర్ కార్యాలయంలో మొరపెట్టుకుంది. స్కూలుకు వచ్చి, బయటకు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు వాపోతోంది. నేతలు, పోలీసులు అతనికి అండగా ఉన్నారని, ఇక తమకు చావే దిక్కని వాపోయింది. రౌడీ షీటరు విష్ణుకు వివాహం అయిందని, అయితే వాడి చేష్టలు భరించలేక భార్య వెళ్లిపోయిందని బాధితురాలి తల్లి తెలిపింది. ఎవరిని కలిసినా తమకు ఇంత వరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చెల్లి వరసయ్యే అమ్మాయిని ఇంతలా వేధిస్తున్నాడని, మిగిలిన ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించింది. తమకు విష్ణుతో ప్రాణభయం ఉందని, రాజు, వినోద్, వినయ్, జానకి రౌడీ షీటర్‌కు మద్దతుగా నిలుస్తున్నారని, దిశ చట్టం కూడా తమకు ఎలాంటి న్యాయం చేయలేదని బాధితురాలి తల్లి వాపోతోంది. ఓ కుటుంబం తమ ప్రాణాలకు రక్షణ లేదని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదంటే అధికార యంత్రాంగం ఎంత చక్కగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2022-09-27T20:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising