ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan సూట్ కేస్ కంపెనీల అవినీతి అందరికీ తెలుసు: Anam

ABN, First Publish Date - 2022-06-30T20:06:52+05:30

సీఎం జగన్‌పై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), లోకేష్‌ (Lokesh)ల చదువుతో జగన్ (Jagan) చదువును పోలుస్తారా? అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkataramana Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ అండ్ డిస్టలరీస్ అసోసియేషన్ మీడియా సమావేశం పెడితే అదాన్ డిస్టలరీస్ కంపెనీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. జగన్ సూట్ కేస్ కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడిన విషయం అందరికీ తెలుసునని, రక్త చరిత్ర కూడా తెలిసిందేనని అన్నారు. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవినీతిని అదుపులో పెట్టి.. రౌడీయిజానికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్నదానిలో ఉండాల్సినవి లేవని.. ఉండకూడనివి ఉంటున్నాయన్నారు. ఫ్రాన్స్‌కు నల్లధనం తరలించారనే ఊహాగానాలున్నాయని, ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-30T20:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising