ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో వ్యతిరేకత

ABN, First Publish Date - 2022-02-16T19:58:56+05:30

నెల్లూరు జిల్లా: కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్  చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా విభజనలో వెంకటగిరికి అన్యాయం జరిగిందన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారని, మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా.. నెల్లూరు-బాలాజీ జిల్లాల పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి.. జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Updated Date - 2022-02-16T19:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising