ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్‌ సర్కార్‌ చెలగాటం: ఆనం

ABN, First Publish Date - 2022-07-24T20:47:49+05:30

ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఏపీ (AP)లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం (Hooch)తో ప్రజల ప్రాణాలతో జగన్‌ సర్కార్‌ (Jagan Govt) చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2 బినామీ కంపెనీల కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. హెరిటేజ్ పాల (Heritage Milk)తో కల్తీ మద్యం బ్రాండ్‌లను పోలుస్తారా? అని ప్రశ్నించారు. బేవరేజస్ ఫోరెన్సిక్ ఆడిట్‌ (Beverages Forensic Audit)కి సర్కార్ సిద్ధమా? అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు.


మంత్రి విడదల రజని (Vidadala Rajini) మద్యపాన నిషేధంపై చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఆదాన్ విస్కీని రూ.36కు కొని రూ.200కి అమ్ముతున్నారని, విషపూరిత మందును రూ.36కే తయారు చేస్తున్నారని, దానివల్ల ఆరోగ్యాలు చెడిపోక ఏముంటుందని అన్నారు. ఇలాంటి విషపూరిత మందులు తాగొద్దని ప్రజలకు మనవి చేస్తున్నానన్నారు. భారతదేశంలో ఉండే బ్రాండ్లలో ఒక్క బ్రాండ్ కూడా ఏపీలో కనిపించడం లేదని విమర్శించారు. ఏపీలోని కల్తీ బ్రాండ్లపై మూడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆనం వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-24T20:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising