అక్కంపేట వీఏఏ ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-12-16T22:57:42+05:30
అక్కంపేట వీఏఏ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలం లోని గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగింది.
వెంకటాచలం, డిసెంబరు 16 : అక్కంపేట వీఏఏ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలం లోని గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు ముత్తుకూరు మండలం పిడతాపోలూరుకు చెందిన ఉప్పు ప్రతాప్ మనుబోలు మండలం అక్కంపేట గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ( వీఏఏ )గా పని చేస్తున్నాడు. వెంకటాచలంలోని కరెంటు ఆఫీస్ పక్కనే ఉన్న ప్రైవేటు క్వార్టర్స్‌లో అద్దెకు ఉంటూ విధులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం గొలగమూడి సమీపంలో ఉన్న అడవిలోని శివాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రతాప్‌ను వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి బాగుందని ఎస్‌ఐ అయ్యప్ప తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకో లేకే వీఏఏ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T22:57:43+05:30 IST