ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్గిరేగితే బుగ్గే!

ABN, First Publish Date - 2022-10-08T04:11:31+05:30

మొన్న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం ఎంతోమంది కొవిడ్‌ బాధితుల ప్రాణాలు తీసింది.

మరమ్మతుకు గురయిన మోటార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచలో కానరాని నివారణ చర్యలు

పని చేయని ఫైర్‌ సేప్టీ పరికరాలు

కొన్ని నెలలుగా మూలనపడ్డ నీటి మోటార్లు

నిధులు లేకనే మరమ్మతుకు వెనకడుగు

అగ్ని ప్రమాదం సంభవిస్తే చేతులెత్తేయాల్సిందే! 


నెల్లూరు (వైద్యం), అక్టోబరు 7 : మొన్న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం ఎంతోమంది కొవిడ్‌ బాధితుల ప్రాణాలు తీసింది. ఇటీవల తిరుపతి జిల్లా రేణిగుంటలో సంభవించిన అగ్ని ప్రమాదం వైద్యుడి కుటుంబాన్నే బలి తీసుకొంది. ఇలాంటి సంఘటనలు ఏదోమూల జరుగుతూనే ఉన్నాయి. మరి నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో (జీజీహెచ) భద్రత కలవరపెడుతోంది. అగ్ని ప్రమాదం జరిగితే సమర్ధవంతంగా ఎదుర్కొనే పరిస్ధితి లేదు. ఫైర్‌ సేప్టీ పరికరాలు వాటి సామర్థ్యాన్ని కోల్పోయి ఏడాది దాటింది. ఉన్న పైపుల ట్యూబులు దెబ్బతిన్నాయి. మరికొన్ని తుప్పుపట్టాయి. వీటిని ఎప్పటి కప్పుడు పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు. 


మరుమ్మతుకు గురైన మోటార్లు


ఐదు అంతస్థుల జీఈహెచకు అనుబంధంగా ప్రసూతి విభాగం, పాత పెద్దాసుపత్రి భవనాలు ఉన్నాయి. వీటికి చెంతనే ప్రభుత్వ వైద్య విద్య కళాశాల, దీనికి దగ్గరలో వైద్య విద్యార్థుల హాస్టల్‌ భవనాలు ఉన్నాయి. భారీ భవనాలు పక్కపక్కనే ఉన్నా ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అగ్నిప్రమాద నివారణ పరికరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఏడాది క్రితం ఈ పరికరాలు మూలనపడ్డాయి. అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు ఆసుపత్రి పరిధిలో మూడు పెద్ద నీటి మోటార్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అన్ని విభాగాలకు నీరు అందించవచ్చు. అయితే ఇవి మరమ్మతుకు గురై 6నెలలు గడుస్తున్నా  మరమ్మతు చేయలేదు. మోటార్లు పనిచేయక పోవటంతో పై అంతస్థులకు నీరు చేరే అవకాశం లేదు. నిధులు లేవనే సాకుతో అధికారులూ మిన్నకుండి పోతున్నారు.

 

వెంటనే  జాగ్రత్తలు తీసుకోవాలి


ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొన్ని వందల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. ఈ పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే నివారించే వ్యవస్థ లేదు. ఆసుపత్రి నిర్వాహణపై ప్రత్యేక దృష్టి పెట్టక పోవటంతోనే ఈ దుస్థితి ఏర్పడుతుంది. అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలి. 

- సతీష్‌కుమార్‌, యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన గౌరవాధ్యక్షుడు


రోగుల ప్రాణాలతో చెలగాటం


రోగుల ప్రాణాలతో జీజహెచ అదికారులు చెలగాట మాడుతున్నారు. ఎంతో కాలం నుంచి సేఫ్టీ పరికరాలు నిరుపయోగంగా మారినా పట్టించుకోక పోవటం అమానుషం. ప్రభుత్వ కూడా అవసరమైన నిధులు విడుదల చేయటంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఇలాంటి చర్యలు మంచిది కాదు. రోగులకు మెరుగైన వైద్య అందిస్తామంటున్న ప్రభుత్వ ఇలాంటి చర్యల వల్ల అభాసుపాలు కాక తప్పదు. 

- ఎల్లంకి వెంకటేశ్వర్లు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి

Updated Date - 2022-10-08T04:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising