ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవుల సంరక్షణ అందరి బాధ్యత : ఏసీఎఫ్‌

ABN, First Publish Date - 2022-05-20T02:46:03+05:30

అడవుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని ఏసీఎఫ్‌ టీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక అటవీ శాఖా కార్యాలయం

మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఏసీఎఫ్‌ రాజశేఖర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉదయగిరి రూరల్‌, మే 19: అడవుల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతని ఏసీఎఫ్‌ టీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక అటవీ శాఖా కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ అడవులు అంతరించిపోతే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడి, మానవ జీవనానికి పెనుప్రమాదం సంభవించే అవకాశముందన్నారు. అడవులను, వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామాల్లోకి తాగునీటి కోసం వస్తున్న వన్యప్రాణులపై సిబ్బంది నిఘా ఉంచాలన్నారు. అవి కుక్కల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ఆయన రేంజ్‌ పరిధిలోని కొత్తపల్లి, దేవమ్మచెరువు అటవీ బీట్‌లను పరిశీలించి అక్కడ జరుగుతున్న హద్దుల ఏర్పాటు పనులను తనిఖీ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బేస్‌క్యాంప్‌, స్ట్రైకింగ్‌ఫోర్స్‌ సిబ్బందికి సూచనలిచ్చారు. అలాగే అటవీ విస్తీర్ణం మ్యాప్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రేంజ్‌ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి, డీఆర్వోలు శ్రీనివాసులు, ఖాజారసూల్‌, ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్‌, ఎఫ్‌బీవోలు నాయబ్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-20T02:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising