వృద్ధుడి హత్య కేసు ఛేదన
ABN, First Publish Date - 2022-12-15T23:34:38+05:30
: మండలంలోని కసుమూరు కొండమీద ఆరునెలల క్రితం జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు నెల్లూరు రూరల్ డీఎస్పీ పీ వీరాంజనేయరెడ్డి గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితురాలిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు.
వెంకటాచలం, డిసెంబరు 15 : మండలంలోని కసుమూరు కొండమీద ఆరునెలల క్రితం జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు నెల్లూరు రూరల్ డీఎస్పీ పీ వీరాంజనేయరెడ్డి గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిందితురాలిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. ‘మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన కూరపాటి వెంకయ్య (74) కొన్నేళ్లుగా కసుమూరు కొండపైన దర్గా ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడపకు చెందిన మోతే నారాయణమ్మ భర్త చనిపోవడంతో 15 ఏళ్ల నుంచి తన కుమారుడు, కుమారైలతో కలిసి కసుమూరు కొండపైన జీవిస్తోంది. ఈక్రమంలో వెంకయ్య, నారాయణమ్మ మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వెంకయ్యకు నారాయణమ్మ కుమారై (21)పై మనస్సు పడింది. విషయం తెలుసుకున్న తల్లి వెంక య్యను నిలదీయడంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈఏడాది జూన్ 8 వేకువజామున 4 గంటలప్పుడు నారాయణమ్మ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లగా అదే అదనుగా భావించిన వెంకయ్య ఆమె కుమారైపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించగా కేకలు వేసింది. దాంతో అక్కడకు చేరుకున్న తల్లి అతడిని కర్రతో కొట్టడంతో గాయాలతో పారిపోయాడు. కొద్దిసేపటికి అతడు వారిని వెంబ డించి మళ్లీ ఆ యువతిని పట్టుకోవడంతో తల్లి అతడిని వెనక్కితోయడంతో రాళ్లమీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. హద్దు రాయితో కళ్లు, చేతులపై కొట్టింది. ఆ తర్వాత కుమారైను తీసుకొని ఇంటికి చేరుకుంది. అటుగా బహిర్భుమికి వెళ్లిన వారు గాయపడ్డ వెంకయ్యను చూసి వెంకటాచలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దూరపు బంధువులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కసుమూరు పంచాయతీలోని వీవర్స్ కాలనీలో ఉంటున్న నిందితురాలు నారాయణమ్మను అరెస్టు చేశారు’ అని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ జీ గంగాధరరావు, ఎస్‌ఐ ఏ అయ్యప్ప, సిబ్బంది గిరిధర్‌రావు, శ్రీనాథ్, సుబ్బారావు, లక్ష్మీకాంత్, రాము తదిత రులున్నారు.
Updated Date - 2022-12-15T23:34:49+05:30 IST