ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-12-31T23:31:02+05:30

కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన గండ్లపాలెంకు చెందిన ఉచ్చులూరి పురుషోత్తం, అమ్మవారిపాలెంకు చెందిన చిన్నకొండయ్య కుటుంబ సభ్యులకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన

గుడ్లూరు : అమ్మవారిపాలెంలో చిన్నకొండయ్య చిత్రపటానికి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు/ గుడ్లూరు, డిసెంబరు 31 : కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన గండ్లపాలెంకు చెందిన ఉచ్చులూరి పురుషోత్తం, అమ్మవారిపాలెంకు చెందిన చిన్నకొండయ్య కుటుంబ సభ్యులకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ చింతం శ్రీనివాస్‌ శనివారం ఆర్థికసాయం అందచేశారు. ఒక్కొ కుటుంబానికి రూ.40 వేల చొప్పున అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయకులు సీ కృష్ణమోహన్‌, చంద్రకుమార్‌, స్థానిక నేతలు దామా మల్లేశ్వరరావు, జీ మోషే, జనిగర్ల నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

ఇంటూరి సాయం

ఉలవపాడు : కందుకూరు రోడ్‌షోలో గాయపడి చికిత్స పొందుతున్న బట్టిసోమయ్యపాలెంకి చెందిన ప్రళయకావేరి గోపాల్‌కు శనివారం టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు రూ.1లక్ష చెక్కును అందచేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో గోపాల్‌ను సందర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, పార్టీ నేతలు కన్నా ప్రసాదు, దామా మల్లేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావు, షేక్‌ సలాం తదితరులు ఉన్నారు.

క్షతగాత్రులకు సాయం

లింగసముద్రం: కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మండలంలోని ఆర్‌ఆర్‌పాలెంకు చెందిన కిలారి రామారావు, లింగసముద్రంకు చెందిన మీసాల బ్రహ్మయ్యలు స్వల్పంగా గాయపడ్డారు. వారికి శనివారం నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు గాలంకి ప్రసాదు, కిలారి వెంకటేశ్వర్లు, అడపా రంగయ్య, అడపా నర్సయ్య, ఎ పెద సత్యం, కె తిరుపతి, డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

--------

Updated Date - 2022-12-31T23:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising