ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి

ABN, First Publish Date - 2022-01-23T04:18:49+05:30

సర్వేపల్లి నియోజకవర్గంలో పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నా

ఆలయ పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే కాకాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, జనవరి22: సర్వేపల్లి నియోజకవర్గంలో పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని  ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రహ్మదేవంలో శనివారం నిర్వహించిన  కైలాసనాథేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆలయాల అభివృద్థికి దాతలు భూములు దానం చేస్తే, టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు వాటిని చేజిక్కించుకుని, దేవుడికే శఠగోపం పెట్టారన్నారు. స్థానిక ప్రజలు, భక్తుల కోరిక మేరకు కైలాసనాథేశ్వర స్వామి ఆలయానికి నూతన కమిటీని నియమించామ న్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ కట్టా సుబ్రహ్మణ్యం, సభ్యులను అభినందించారు. అనంతరం ఈదులవారిపాళెం ఆర్‌బీకేను పరిశీలించారు. రైతులకు ఎరువులను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, ఎంపీపీ గండవరపు సుగుణ, జడ్పీటీసీ సభ్యులు బందెల వెంకటరమణయ్య, ఉపాధ్యక్షుడు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, నాయకులు నెల్లూరు శివప్రసాద్‌, అగ్ని మస్తాన్‌, కోఆప్షన్‌ సభ్యుడు జమీల్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T04:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising