ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల నిర్వహణలో బాధ్యతతో పనిచేయాలి

ABN, First Publish Date - 2022-07-02T03:21:43+05:30

పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు బాధ్యతతో పనిచేయటం ద్వారా రైతులకు మేలు జరిగేలా చూడాల

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూలై 1: పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు బాధ్యతతో పనిచేయటం ద్వారా రైతులకు మేలు జరిగేలా చూడాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నిబంధలన పేరుతో రైతులను ఇబ్బంది పెడితే దళారులకు మేలు చేయటం తప్ప మరొకటి కాదన్నారు. ఈ ప్రాంతంలో జొన్న సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరగటంతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభింపజేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం క్వింటాల్‌ జొన్నలకు రూ. 2,738 చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఫైన్‌క్వాలిటీ జొన్నలుగా కందుకూరు ప్రాంతంలోని జొన్నలను గుర్తించేలా కృషి చేసిన ఎమ్మెల్యే మహీధరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం పవన్‌కుమార్‌, కందుకూరు ఏడీఏ శేషగిరిరావు, ఏవో అబ్దుల్‌ రహీం, బడేవారిపాలెం పీఏసీఎస్‌ ప్రెసిడెంట్‌ తోకల నరసింగరావు, కార్యదర్శి రమేష్‌, గణేశం గంగిరెడ్డి, ఎం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T03:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising