ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

484 శ్రీగంధం దుంగల పట్టివేత

ABN, First Publish Date - 2022-01-15T04:51:04+05:30

అక్రమంగా రవాణా చేస్తున్న 484 శ్రీ గంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన శ్రీగంధం దుంగలు, నిందితుల సమక్షంలో వివరాలు వెల్లడిస్తున్న గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8మంది నిందితుల అరెస్టు

వాహనాలు స్వాధీనం 

సూళ్లూరుపేట, జనవరి 14 : అక్రమంగా రవాణా చేస్తున్న 484 శ్రీ గంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆ వివరాలు వెల్లడించారు. ‘కృష్ణపట్నం నుంచి చెన్నైకు 484 దుంగలను తరలిస్తున్నారని సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్‌ఐలు శ్రీనివాసరెడ్డి, రోజాలతలకు ముందస్తు సమాచారం  అందింది. దాంతో వారు జాతీయ రహదారిపై కాపుకాచారు. రెండు పైలెట్‌ కార్లను, శ్రీగంధ దుంగలను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. దగదర్తి మండలం కట్టుబడిపాళేనికి చెందిన తుపాకుల మహేంద్ర, అనంతసాగర మండలం రేవూరుకు చెందిన ఎం. మురళీకృష్ణ, దగదర్తి గ్రామానికి చెందిన యు. రామచంద్రయ్య, నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన కె. మాలకొండయ్య, గూడూరు మండలం మిట్ట ఆత్మకూరుకు చెందిన కె. పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధగుంటకు చెందిన కె. వెంకటరమణయ్య, పొదలకూరు గ్రామానికి చెందిన ఎన్‌. మణి, రాపూరు మండలం గోనుపల్లి గ్రామానికి చెందిన వెలుగు అంకయ్య అనే నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు’ అని వెల్లడించారు.  ఈ కేసులో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు.

Updated Date - 2022-01-15T04:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising