ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలో ఉన్నా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరే వేరు..!

ABN, First Publish Date - 2022-07-07T02:37:48+05:30

అధికారులపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఉదయగిరిలో అధికారులు ఎవరో తనకు తెలియదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): అధికారులపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Udayagiri Mla Mekapati Chandra Shekar) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఉదయగిరి (Udayagiri)లో అధికారులు ఎవరో తనకు తెలియదని ఆయన చెప్పారు. వాళ్లమటుకు వాళ్లు వచ్చి వెళ్లిపోతున్నారని.. తమను కలిస్తే సమస్యలు చెబుతామన్నారు. తమది మెట్టప్రాంతమని.. అధికారులు కాస్తంత జాలి చూపాలని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 


‘‘ఉదయగిరి డిగ్రీ కాలేజీలో సమస్యలు చాలా ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడా సరిగాలేవు. హైస్కూల్ పాత భవనాల్లో నడుస్తుంది. ఎప్పుడు కూలుతుందో అర్ధం కావడం లేదు. ఇంటర్ కాలేజీ పాత భవనాల్లోనే నడుస్తుంది. పిల్లలు రాక.. మా ఇంజనీరింగ్ కాలేజీ మూత వేసుకున్నాం.’’ అని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 


కాగా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Mla Kotam Reddy Sridhar Reddy) కూడా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు టౌన్‌లో మురుగు కాలువ సమస్యలపై ఆయన వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మురుగు కాలువలో దిగి అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆయన అక్కడే బైఠాయించారు. అనంతరం శాంతించారు.


ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులపై విమర్శలు వస్తున్నారు.  ‘గడపగడపకు ప్రభుత్వం’’ అంటూ కార్యక్రమాలు జరుగుతుండగా అధికారుల తీరుపై అధికార పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు నిరసన చేపడితేనే అధికారులు స్పందిస్తారా..?. ప్రజలు చెబితే కనీసం పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2022-07-07T02:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising