ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palm oil: ఏపీలో పామ్‌ ఆయిల్ సాగు అభివృద్ధికి 104 కోట్లు

ABN, First Publish Date - 2022-07-29T23:10:39+05:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 104 కోట్లతో పామ్‌ ఆయిల్ (Palm oil) సాగును అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 104 కోట్లతో పామ్‌ ఆయిల్ (Palm oil) సాగును అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. తూర్పుగోదావరి (East Godavari), గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 లక్షల 31 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్‌ సాగుకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో పామ్‌ ఆయిల్‌ సాగు అభివృద్ధికి  కేంద్ర ప్రభుత్వం 62 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షలు తన వాటాగా భరించాల్సి ఉందని అన్నారు. పామ్‌ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున విస్తరించి క్రూడ్ పాం ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించడమే ఈ మిషన్ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్‌ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశంలో 28 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి  చేయనున్నట్లు తోమర్ చెప్పారు.

Updated Date - 2022-07-29T23:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising