ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రుషికొండ ఏరియా పాక్‌ సరిహద్దా?: నారాయణ

ABN, First Publish Date - 2022-08-02T02:41:59+05:30

ప్రకృతి అందాలకు నెలవైన రుషికొండ ఏమైనా పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతమా? అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ప్రకృతి అందాలకు నెలవైన రుషికొండ ఏమైనా పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతమా? అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సీపీఐ నేత నారాయణ (CPI leader Narayana) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషికొండ (Rushikonda)  తవ్వకాలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కలసి సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి ఆయన బయల్దేరారు. దీంతో పీఎంపాలెం ఏసీపీ చుక్కా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రుషికొండకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎండాడ మీదుగా రుషికొండ వచ్చిన నారాయణ వాహనాన్ని పోలీసులు జంక్షన్‌కు ముందే నిలిపివేశారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిషేధం విధించినందున ఎవరినీ అనుమతించడం లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఏమైనా పాక్‌ సరిహద్దులో ఉందా? అని ప్రశ్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌, రోప్‌వేను దాటుకుని ముందుకెళుతుండగా పీఎంపాలెం ఏసీపీ శ్రీనివాస్‌.. దయచేసి వివాదం సృష్టించవద్దని కోరారు. కొండను పరిశీలించేందుకు వెళితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అక్కడేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? అని నారాయణ ప్రశ్నించారు.

Updated Date - 2022-08-02T02:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising