ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనూహ్యంగా వ్యూహం మార్చిన రఘురామకృష్ణంరాజు

ABN, First Publish Date - 2022-07-04T03:10:34+05:30

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనూహ్యంగా వ్యూహం మార్చారు. భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అనూహ్యంగా వ్యూహం మార్చారు. భీమవరంలో అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణకు ఆయన హాజరుకానున్నారు. అయితే వెహికల్‎లో భీమవరం వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు నిరాకరించారు. దాంతో కలెక్టర్‌‎కు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రఘురామరాజు  రైలులో భీమవరానికి బయల్దేరి వెళ్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లో రఘురామరాజు భీమవరం బయల్దేరారు. ఈ మేరకు ఆయన ముందుగానే నర్సాపూర్ ఎక్స్‎ప్రెస్‎లోని ప్రత్యేక బోగిని బుక్ చేసుకున్నారు. రఘురామరాజుతో పాటు ఏపీ పరి రక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్‌, మరో 20 మంది నేతలు భీమవరం బయల్దేరారు. 


మరోవైపు raghurama rajuను ఏపీ నిఘా టీం ఫాలో అవుతోంది. ఇప్పటికే మోడీ సభ‌ పార్కింగ్‎లోకి ప్రవేశించేందుకు  రఘురామరాజు కారుకు పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం పాసులు ఇవ్వలేదు. అటు గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామను భీమవరం వరకు రానివ్వరని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. భీమవరంలోని రఘురామరాజు నివాసం వద్ద కూడా నిఘా వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2022-07-04T03:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising