ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-05-19T16:57:54+05:30

రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేదని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేదని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారన్నారు. అయినా ప్ర‌భుత్వ స్పంద‌న శూన్యమన్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌గా, హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌మే జీవిత‌ ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని నారా లోకేష్ పేర్కొన్నారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి ప్ర‌స్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌ర‌కూ రోడ్డు ప్ర‌యాణం ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోనుంద‌ని రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెబుతున్న‌ట్టే ప్ర‌వ‌చ‌నంలో భాగంగానే వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్ప‌ష్టం అవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-19T16:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising