ఉత్తరాంధ్ర పులిని చూసి ప్యాలస్ పిల్లి భయపడింది: Nara Lokesh
ABN, First Publish Date - 2022-11-03T11:26:26+05:30
మా ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడుని చూసి ప్యాలస్ పిల్లి భయపడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి : మా ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడు (Ayyannaptrudu)ని చూసి ప్యాలస్ పిల్లి భయపడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల దోపిడి, భూకబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకే బీసీ నేత అయన్నపాత్రుడుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి గోడ కేసులో అయన్నపాత్రుడు, రాజేష్‌ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తక్షణమే వారిని విడుదల చెయ్యాలి. అయ్యన్నపాత్రుడు గారి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జగన్‌కు నారా లోకేష్ సూచించారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అయ్యన్న పాత్రుడికి అండగా మొత్తం తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. చెత్త మీద పన్నేసిన చెత్త పాలకుడికి పోయేకాలం దగ్గర పడిందని నారా లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - 2022-11-03T11:26:29+05:30 IST