ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ ఎంపీగా పోటీ చేయడంపై నాగార్జున క్లారిటీ

ABN, First Publish Date - 2022-09-30T22:33:55+05:30

విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున హీరో అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున హీరో అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అయితే ఈ వార్తలను నాగార్జున ఖండించారు. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటివాటిని తాను పట్టించుకోనని అన్నారు. కాగా నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ  కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.


ఆయన సీఎం జగన్‌తో చాలా సన్నిహితంగా ఉంటారు. అక్రమ సంపాదన కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు నాగార్జున జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. ఆ మద్య సినిమా టికెట్ల తగ్గింపుపై సినీ పెద్దలు ఆందోళన చెందారు. ఒక్క నాగార్జున మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. జగన్‌తో నాగార్జున సన్నిహితంగా మెలగడంతో అందరూ ఆయన వైసీపీ చేరుతారని అనుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోలేక పోయింది. అందువల్ల ఈ సారి అక్కడి నుంచి నాగార్జునను నిలబెట్టి విజయం సాధించాలని సీఎం జగన్ భావించారని ప్రచారం చేశారు. కానీ ఇదంతా అవాస్తమని నాగార్జున వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

Updated Date - 2022-09-30T22:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising