ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తారా?’

ABN, First Publish Date - 2022-06-30T01:15:29+05:30

జీపీఎఫ్ డబ్బులు మాయం చేయడమంటే ఉద్యోగులను మోసగించడమేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీపీఎఫ్ డబ్బులు మాయం చేయడమంటే ఉద్యోగులను మోసగించడమేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసిపూసి మారేడుకాయ చేస్తోందన్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న డబ్బులు వారికి తెలియకుండా తీసుకోవడం అంటే మోసం చేయడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-30T01:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising