నాకు ప్రాణహాని ఉంది: చీకోటి ప్రవీణ్
ABN, First Publish Date - 2022-08-04T09:10:31+05:30
నాకు ప్రాణహాని ఉంది: చీకోటి ప్రవీణ్
హైదరాబాద్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తనకు ప్రాణహాని ఉందని, ఇదే విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ బుధవారం సుమారు గంట సేపు విచారించింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని విచారణ అనంతరం చీకోటి ప్రవీణ్ విలేకరులకు తెలిపారు. హవాలా రూపంలో డబ్బు మళ్లించానో లేదో అనే దానికి ఈడీ అధికారులకు పూర్తి అధారాలు సమర్పించానని చెప్పారు. తాను క్యాసినో ఆడిపిస్తున్నానని, గోవాలో అది చట్ట వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. క్యాసినో ఆడేందుకు వచ్చేవాళ్లను తాను ఎందుకు అడ్డుకుంటానని ప్రశ్నించారు. చాలామంది తనపై చేతికాని ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కాగా, అన్ని అనుమతులు తీసుకునే తన ఫామ్‌హౌ్‌సలో జంతువులను పెంచుతున్నానని స్పష్టం చేశారు.
Updated Date - 2022-08-04T09:10:31+05:30 IST