ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode by-election: అందుకే మునుగోడులో పోటీ చేయడం లేదు: పవన్‌

ABN, First Publish Date - 2022-08-21T22:41:48+05:30

విధ్వంస రాజకీయాలు నాకిష్టం లేదు. అందుకే మునుగోడు (Munugode)లో పోటీ చేయడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో అనేకమందికి భయం పట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ‘‘విధ్వంస రాజకీయాలు నాకిష్టం లేదు. అందుకే మునుగోడు (Munugode)లో పోటీ చేయడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో అనేకమందికి భయం పట్టుకుంది. హైదరాబాద్‌ (Hyderabad)లో ఆస్తులు పోతాయని ఎంపీలు మాట్లడలేదు. నేను ఎవ్వరికీ భయపడేది లేదు. నా ఆస్తులు లాక్కొన్నా పర్వాలేదు.. నిలబడతా’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ‘‘గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుపై నా కారణాలు నాకు ఉన్నాయి. నేను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదు. దేశంలో, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం. ప్రజారాజ్యం (Praja Rajyam Party) ఉంటే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అయ్యేది. టీడీపీ (TDP)కి, వైసీపీ (YCP)కి కొమ్ముకాయడానికి సిద్ధంగా లేను. రాజకీయంగా గౌరవిస్తాం.. విధానాలపై పోరాడతాం. సీమలో ఫ్యాక్షన్‌ ఎక్కువంటారు.. నాకు కనిపించలేదు. రాయలసీమలోని కులాల మధ్య అసమానతలున్నాయి. సీమలోని అనేక ఉపకులాలకు గుర్తింపు కూడా లేదు. వెనుకబడిన వర్గాలకు కూడా రాజకీయ అధికారం రావాలి’’ అని జనసేన అధినేత వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జాకు గురవుతున్నాయి. వైసీపీ పాలనలో పంచాయతీలకు కూడా నిధులు లేవు’’ అని పవన్‌కల్యాణ్ ఆరోపించారు.

Updated Date - 2022-08-21T22:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising