ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీ సునీల్‌ను తక్షణమే బదిలీ చేయండి.. కేంద్రహోంశాఖకు రఘురామరాజు లేఖ

ABN, First Publish Date - 2022-01-19T23:46:34+05:30

సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని ఆయన లేఖలో తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని పేర్కొన్నారు. పీవీ సునీల్ కుమార్ ఈ రోజు భార్య, తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పీవీ సునీల్‌ను తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.


Updated Date - 2022-01-19T23:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising