ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla Video.. సునీల్ కుమార్ ట్రిపులార్ సినిమా స్టొరీ చెప్పారు: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2022-08-19T21:58:16+05:30

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్‌లో చాలా అద్భుతంగా ట్రిపులార్ సినిమా స్టొరీ చెప్పారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): ది డర్టీ వీడియో తనది కాదంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) ఖండించారని, నిన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ (Sunil Kumar) కూడా ప్రెస్ మీట్‌ (Press meet)లో చాలా అద్భుతంగా  ట్రిపులార్ (RRR) సినిమా స్టొరీ చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రైవేట్ ల్యాబ్ సంస్థ ఇచ్చిన ఒరిజినల్ లెటర్ సునీల్ కుమార్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జిమ్ స్టాఫెర్డ్ సంతకం లేకుండా లేఖ ఇచ్చారని, సునీల్ కుమార్ రాసిన లేఖకు రిప్లయ్ ఇచ్చిన జిమ్ స్టాఫెర్డ్ పంపిన రెండో లేఖ ఏదన్నారు. పీవీ సునీల్ కుమార్ జిమ్ స్టాఫెర్డ్‌కు రాసిన లేఖ విడుదల చేయాలన్నారు. వీడియో ఫేక్ అని సునీల్ ఎలా చెప్తారని రఘురామ నిలదీశారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై చర్యలు తీసుకోవాలని వైసీపీ మంత్రులు (YCP Minister) అంటున్నారని, దీనికి టీడీపీకి  సంబంధం ఏంటని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. చిన్న పిల్లలకు దెబ్బ తగిలితే అమ్మ అంటారు, వైసీపీ వాళ్లకు ఏమైనా అయితే కమ్మ లేకపోతే టీడీపీ అంటున్నారన్నారు. గతంలో పృథ్విరాజ్‌పై తీసుకున్నంత వేగంగా గోరంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సునీల్ కుమార్ దగ్గర ఉన్న రెండు లెటర్స్ విడుదల చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. పవర్ ఎక్స్ంజ్‌లో ఏపీకి విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేస్తామని కేంద్రం చెప్పిందని, జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళ మూడు నెలలు అయింది.. ఇది చంద్రబాబు పాపం ఎలా అవుతుందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో విద్యుత్ సమస్య లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం సీబీఐ కేసు నడుస్తుంది కాబట్టి... ఈడీ ట్రయిల్ ఆపాలని కోరారు... అసలు జగన్ కోర్టుకు వెళ్లడం లేదన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశానని, విచారణ జరిపిన హైకోర్టు జడ్జిమేంట్ రిజర్వ్ చేసి 8 నెలలు అవుతోందని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-19T21:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising