ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే నన్ను పార్టీ ఛానల్ డిబేట్‌కు పిలవాలి: ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2022-01-19T21:40:57+05:30

కొందరు ఉద్యోగులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రానా హక్కుల సాధన కోసం ఉద్యమం ఆపవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కొందరు ఉద్యోగులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రానా హక్కుల సాధన కోసం ఉద్యమం ఆపవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గతంలో సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్న సీఎం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నిలబెట్టుకోలేదన్నారు. జీతాలు సరైన సమయంలో ఇవ్వకపోగా.. ఉన్న జీతాల్లో కోత పెట్టారని మండిపడ్డారు. హెచ్ఆర్ఏ నుంచి పోలీసులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సీఎం ఆదేశించినప్పుడు కొట్టడం, తప్పుడు కేసుల పెట్టినందుకే ఈ ప్రతిఫలం అన్నారు. రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది కాబట్టి ఉద్యోగస్థుల ప్రయోజనాలకు కోత పెట్టారని ఆయన పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయకుండా.. అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నా.. దమ్ముంటే అనర్హత వేటు వేయించుకోండన్నారు. అన్ని పార్టీల మద్దతుతోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తానని స్పష్టం చేశారు. ‘‘దమ్ముంటే నన్ను తమ పార్టీ ఛానల్ డిబేట్‌కు పిలవాలి’’ అన్నారు. 

Updated Date - 2022-01-19T21:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising