ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla Madhav: గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కేసులో కీలక మలుపు

ABN, First Publish Date - 2022-08-10T21:32:34+05:30

ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నగ్నంగా మాడిన వీడియో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) నగ్నంగా మాట్లాడిన వీడియో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సాయంత్రం ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అనంతపురం పోలీసులు బయటపెట్టనున్నారు. అయితే ఈ రిపోర్టులో ఏముందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఫోరెన్సిక్‌ రిపోర్టు (Forensic report)లో వీడియోలు నిజమని తేలితే.. మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు (YCP leaders) చెబుతున్నారు. రిపోర్ట్ బయటపెట్టాలని టీడీపీ (TDP) డిమాండ్‌ చేస్తోంది. గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ (video call) చేసి మాట్లాడారు. ఈ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. మాధవ్‌ వీడియో వ్యవహారం‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ, మహిళా సంఘాలు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) ప్రభుత్వాన్ని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. మాధవ్‌పై కచ్చితంగా చర్యలు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. 


ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్‌పై చర్యలు ఉండవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తేల్చేశారు. మాధవ్‌ వ్యవహారాన్ని ఓటుకి నోటు కేసుతో ఆయన పోల్చారు. గతంలో తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వాయిస్‌తో వచ్చిన.. ఆడియోకు సపోర్టింగ్‌గా డబ్బులు కూడా దొరికాయని తెలిపారు. ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. ప్రస్తుత ఇష్యూ కంటే చంద్రబాబు ఇష్యూ పెద్దదని చెప్పారు. గోరంట్ల వ్యవహారంలో మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజానిజాలు తేలేవరకూ ఆగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను అనంతపురం పోలీసులు బయటపెట్టన్నారు. ఈ రిపోర్టులో నిజం అని తేలితే మాధవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Updated Date - 2022-08-10T21:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising